వ్యాసములు : 2.12.- రాముని సద్గుణ నవకము
2.12. సర్గ -రాముని సద్గుణ నవకము
కైకేయి దశరథుని కోరరాని కోరికలు కోరగా, ఆమెకు రాముని సద్గుణములు దశరథుడు వర్ణించాడు అందు ఉదహరింపబడిన నవ సద్గుణములు వివరములు
2.12.30. (1) సత్యము, (2) దానము, (3) తపస్సు, (4) త్యాగముచేయుట, (5) స్నేహశీలత. (6) అంతర్బాహ్య పరిశుద్ధత, (7) నిష్కపటము, (8) విద్య, (9) గురుశుశ్రూష అను సద్గుణములు రాముని యందు రూఢిగ నున్నవి. (1) సత్యము- మనోవాక్కాయకర్మల యందు ఒకేవిధముగ నుండుట. (2) దానము- తనకు ఉన్నది ఇతరులకు ఇచ్చుట. (3) తపస్సు- శాస్త్రము విధించిన ప్రకారము యమనియమాది పాటించుట. (4) త్యాగము- ఇతరుల అవసరములకు తన అవసరము విడుచుట. (5) మిత్రత- ఇతరులందు ఆత్మీయత ప్రసరించుట. (6) శౌచము- అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి కలిగి ఉండుట. (7) ఆర్జవము-సరళత్వము, కపటము లేకపోవుట. (8) విద్య- సకల విద్యలు, తత్వజ్ఞానములు కలిగి ఉండుట. (9) గురుశుశ్రూష- విద్యా బోధకులకు, పెద్దలకు చేయు సేవలు.