వ్యాసములు : 2.12.43. స్వమాంస నేత్ర దానములు
2.12.43. స్వమాంస నేత్ర దానములు
(1) పూర్వము శిబిచక్రవర్తి ఔదార్యము పరీక్షింప గోరి దేవేంద్రుడు డేగ రూపం ధరించి, పావురము రూపం ధరించిన అగ్నిదేవుని వేటాడుతూ తఱుము చుండెను. పావురము శిబిచక్రవర్తిని ఆశ్రయించెను. డేగవచ్చి “పావురము నా ఆహారము, నేను భక్షింపవలయును దానిని విడువుము” అనెను. శిబిచక్రవర్తి పావురము బరువుకు సమానమైన మాంసము తన శరీరమునుండి కోసి ఇచ్చి పావురమును రక్షించెను. ఇంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతని ఔదార్యము మెచ్చుకొని, వరములు ఉత్తమలోకములు అనుగ్రహించిరి.
(2) పూర్వము రాజర్షి అలర్కుని కడకు ఒక అంధుడు వచ్చి, తనకు నేద్రదానము చేయమని అడిగెను. వెంటనే ఆ అలర్క మహారాజు తననేత్రములను ఆ బ్రాహ్మణునకు ఇచ్చెను. పరమగతిని పొందెను