వ్యాసములు : 1.1.96.చాతుర్వర్ణవ్యవస్థ
చాతుర్వర్ణవ్యవస్థ
చాతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు నాలుగు. ఇది ఒక పరిపాలకనా ప్రణాళిక. ఒక త్రిభుజమువలె ఒకదాని కంటె తరువాతది అధికమైన జనాభా ఉండవలెను. ఆయా బాధ్యతలు తగు ఆహార ఆహార్య ఆచార నియమములు కలవు.
గమనిక:- వర్ణములకు కులములకు నామసారూప్యత తప్ప సంబంధము లేదు. ప్రతి కులమునందు ఈ పరిపాలనా వ్యవస్థ ఉండును. ఆయా కుల ధర్మములను అనుసరించి ఆయా వర్ణముల సాంధ్రత మారును.
ప్రథమ వర్ణము - బ్రాహ్మణ
వీరి సంఖ్య తక్కువగా ఉండును. మెదడు వాడి చేయవలసిన పనులు, సమాజమునకు కావలసిన విద్యలు, మత్రాంగములు, ఆవిష్కరణలు, సమాజ క్షేమమునకు వలసిన ఆధ్యాత్మిక కార్యములు చేయవలసినవారు.
ఉదా. పౌరోహిత్యము చదువులు విద్యలు నేర్పుట, శాస్త్రముల అద్యయన పరిశోధనలు.
ఆహారము సాత్వికము శాకాహారము, ఉప్పుకారము తక్కువ. పిండిపదార్థములు చక్కెరలు అధికము.
ఆహార్యము శిరోముండనము, వదులు వస్త్రములు.
ఆచారములు కఠినమైనవి.
ద్వితీయ వర్ణము - క్షత్రియ
ప్రథమ వర్ణము కంటె అధిక సంఖ్యలో ఉండవలెను. ప్రజాక్షేమం, సమాజ సంపదల రక్షణ కొఱకు ధైర్యంగా పాటుపడవలసినవారు,
ఉదా. వీరులు, రక్షకులు, కాపలాదారులు, ఏలికలు, ప్రభువులు.
ఆహారము రజోగుణ ప్రెరితములు. శాకాహారము మాంసాహారము, ఉప్పూ కారము అధికము, కొవ్వుపదార్థములు.
ఆహార్యము నిండైన వస్త్రధారణ, అధిక అలంకారములు.
ఆచారములు పరోపకార ప్రేరితములు. రజోగుణోపూరితములు. ఆడంబరములు
తృతీయ వర్ణము- వైశ్య
వీరి సంఖ్య తగుమాత్ర అధికము. శారీరక, మానసిక నేర్పులతో కూడిన వృత్తులతో సంపద సృష్టించు పనులు చేయువారు.
ఉదా. వ్యాపారము, వ్యవసాయము, పశుపాలన, వడ్రంగము, రథసారథ్యము.
ఆహారము మిశ్రమాహారము. ఉప్పుకారము తగినంత, చక్కెర అధికము.
ఆహార్యము తగినంత వస్త్రధారణ, అలంకార ధారణ.
ఆచారములు వృత్తికి తగు ఆచారములు తగు ఆడంబరములు
చతుర్థ వర్ణము- శూద్ర
వీరి సంఖ్య అధికము. శారీరక శ్రమ ప్రధానముగా జీవనము సాగించువారు.
ఉదా. ప్రథమ వర్ణములో పరికరములు, సంభారములు సమీకరణ. ద్వితీయ కాల్బలము, సేవకులు, తృతీయ వృత్తి అవసరములకు వలసిన శ్రామికులు,
ఆహారము బలమైన ఆహారములు. అధికపరిమాణము, ఉప్పూకారము తగినంత.
ఆహార్యము తక్కువ బిగువు గలవి.
ఆచారములు తగు మాత్రము