వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పారిభాషికపదమలు : దండకారణ్యము

దండకారణ్యము
1.3.17

1) ఇక్ష్వాకు పుత్రుఁడు అగు దండుఁడు అసురకృత్యములచే జననిందితుఁడు అగుటవలన తండ్రిచే వింధ్యశైలమునకు పంపఁబడి అందు మధుమంతము అను పట్టణము ఒకటి నిర్మాణము చేసికొని అసురులతో కలిసి అసురగురువైన శుక్రాచార్యులకు శిష్యుఁడు అయి ఆపురమును ఏలుచు ఉండెను. ఒకనాడు అతఁడు శుక్రాచార్యుని ఆశ్రమమునకు పోయి అచట తపము ఆచరించుచు ఉన్న అతని పెద్దకొమార్తె అగు అరజ అను దానిని కని మోహించి అది అయుక్తము అని ఆమె ఎంత చెప్పినను వినక బలాత్కారముగా ఆమెను కూడి వెడలిపోయెను. పిదప దానివిని శుక్రుఁడు మిగుల ఆగ్రహించి ఆదండుఁడు సపరివారముగ నేలపాలు అగునట్లును, ఆ మధుమంతముచుట్టు ఏఁడుదినములు మట్టి వాన కురియునట్లును జనశూన్యము అగునట్లును శాపము ఇచ్చెను. పురాణనామచంద్రిక. 2) వింధ్యకు దక్షిణమున తూర్పు దక్షిణ నడుమ ప్రదేశము మఱియు గంగా కృష్ణానదుల పరివాహక ప్రదేశము నందు గల అటవీ ప్రాంతము. 3) శూర్పణక, ఖరదూషణాదుల నివాసస్థానము.