వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : విశిష్ఠ రామాయణములు

విశిష్ఠ రామాయణములు.

1) ఆసియాటిక్ సొసైటీ పండితులు కలకత్తాలోని చిన్న సంస్కృత గ్రంథాలయంలో 6వ శతాబ్దపు రామాయణ ప్రతిని కనుగొన్నారు. ఇది 5 సంపుటీలుగా ఉన్నది.ఇందు బాలకాండ లేదుట. రామపట్టాభిషేకము వరకు ఉన్నదిట.

2) బంగారంతో చేసిన రామాయణం: - గుజరాతులోని సూరత్ నందు వజ్రాలు కెంపులు పచ్చలు పొదిగిన రామాయణన్ని బంగారంతో వ్రాసారు. దీనికి 222 గ్రాముల బంగారం వెండి నిజమైన వజ్రాలు రత్నాలతో నిజ రూపొందించారు. 530 పుటలు గల ఈ రామాయణం బరువు 19 కేజీలు. 1981లో తయారుచేసి ప్రచురించారు.

3)
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాల రాముడికి ఒక భక్తుడు ‘బంగారు రామాయణాన్ని’ కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై వ్రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఈ ప్రతిని 151 కిలోల బరువున్న రామచరిత మానస్‌ (రామాయణం) ను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు.


4)
సుమారు 2 శతాబ్దాల పురాతనమైన అంగుళం పొడవు వెడల్పులతో చేసిన రామాయణము, వెండి భరిణలో భద్రపరచబడి, బరోడా, గుజరాతులో ఉన్నది సౌజన్యము- టైమ్స్ ఆఫ్ ఇండియా. One inch by one inch: Barodian to display tiny 175-year-old Ramayana today. TNN / Updated: Jan 22, 2024, 08:12 IS Prem Shah, a Barodian who is in possession of the Ramayan book, is nearly two-centuries-old and measures just one inch by one inch. It is kept in a Silver Box. Read more at: http://timesofindia.indiatimes.com/articleshow/107039334.cms?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc&utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst


5) కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని పురానాటుకరకు చెందిన అత్తూర్ సంతోష్ కుమార్ 5మిమీx5మిమీ సంక్షిప్త రామాయణాన్ని కరోనా కాలంలో రూపొందించారు. ఇందులో, భూతద్దంతో మాత్రమే చదవగల 24,000 శ్లోకాలు ఉన్నాయి. -