వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : వానరోత్తములు - దేవతల అంశ

వానరోత్తములు - దేవతల అంశ
1.17. (బాలకాండ సప్తదశమ సర్గ)

1. బ్రహ్మదేవుడు- సృష్టికర్త, దేవతాగ్రేశ్వరుడు- పుత్రుడు జాంబవంతుడు,
2. ఇంద్రుడు- ఇంద్రియాధిదేవత, తూర్పుదిక్పతి, దేవతల రాజు ద్వాదశాదిత్యులలో ఒకడు- పుత్రుడు వాలి.
3. సూర్యుడు- ఆదిత్యులలో ఒకడు- పుత్రుడు సుగ్రీవుడు.
4- బృహస్పతి దేవతల గురువు- పుత్రుడు తారుడు.
5. కుబేరుడు- ధనాధిపతి, ఉత్తరదిక్పాలకుడు- పుత్రుడు గంధమాదనుడు.
6. విశ్వకర్మ- దేవతల శిల్పి- పుత్రుడు నలుడు.
7. అగ్నిదేవుడు- నిప్పులకు అధిదేవత, ఆగ్నేయ దిక్పాలుడు- పుత్రుడు నీలుడు.
8, 9. అశ్వనీదేవతలు- ఆసత్యుడు, ద్రస్యుడు అను ఇద్దరు దేవతల వైద్యులు- పుత్రులు మైందుడు, ద్వివిదుడు.
10. వరుణుడు- జలదేవత, పడమటిదిక్కు అధిపతి, ద్వాదశాదిత్యులలో ఒకడు- సుషేణుడు.
11. పర్జన్యుడు- వర్షాధిదేవత- పుత్రుడు శరభుడు.
12. వాయుదేవుడు- వాయువులకు అధిదేవత, వాయవ్య దిక్పాలుడు- పుత్రుడు హనుమంతుడు

వానరవీరుల సామర్థ్యములు
1.17. (బాలకాండ సప్తదశమ సర్గ)

1. వానర (వా అనగా వాలము. వాలము కలవారు) వీరులు ఋక్ష (ఎలుగుబంటికి వలె శరీరమంతా దట్టమైన వెంట్రుకలు కలవారు) వీరులు దేవత అంశలతో పుట్టిరి.
2. కామరూపులు
3. స్వేచ్ఛావిహారులు
4. సింహశార్దూల మహాబలశాలులు
5. శిలాప్రహరణ నిష్ణాతులు
6. చెట్లను పెకలించి వాటితో పోరగలవారు
7. గోళ్ళతోనూ దంతాలతోనూ భీకరంగా పోరగలవారు
8. సర్వ శస్త్రాస్త్ర కోవిదులు
9. పెద్ద కొండలను సైతం కుదిపేయగలరు
10. బలమైన పెద్ద పెద్ద వృక్షాలను సైతం కూల్చగలరు
11. సముద్రాలను సైతం కలచివేయగలరు
12. కాళ్లతో నేలను చీల్చేయగలరు
13. మహాసముద్రాలైనా దూకి దాటగలరు
14. ఎగిరి మేఘాలను అడ్డుకొనగలరు.
15. మదించిన అడవి ఏనుగులను ఐనా నిర్బంధించగలరు.
16. గర్జనలతో ఆకాశంలోతిరిగే పక్షులను పడగొట్టగలరు
17. మహాయోధులు
18. మహాత్ములు
19. గరుత్మంతు వంటి బలము కలవారు.
20. అడవిలోని సింహములు, పులులు, సర్పాలను పీడించెడవారు

21. వీరందరు అనేకరకములైన ఆకృతులు, ఆంగికములు, స్వభావములు కల శూరులు.
22. వీరందరూ అడవులు, సముద్రాలు, పర్వతాలమయ మైన ఈ భూమండలము అంతటా ఆవరించిరి.
23. వీరు కోట్లకొలది సంఖ్యలో ఉత్పత్తి అయి ఉన్నారు.
24. వీరందరూ అనేకమంది నాయకశ్రేష్టులను పుట్టించిరి. అనేక వానరసేనలుగా ఏర్పరచిరి. సేనానాయకులుగ ఉండిరి.
25. వేలకలది మంది నివాసము ఋక్షపర్వతము.
26. వారందరు వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వానర సేనానాయకులు అధీనంలో ఉండేవారు.