జాబితాలు : ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఉపనిషత్తులు వేదాల చివరి భాగంలో ఉంటాయి గనుక వేదాంతమని, వేదాగ్రమని కూడా వ్యవహరిస్తారు. వేదాల చివరి బాగాలు. గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. 1. పరావిద్య, 2. అపరా విద్య. ఇంకా, ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ అంటారు.
1. ఈశావాశ్యము, 2. తలవకారము, 3. కఠవల్లి, 4. ప్రశ్న, 5. ముండకము, 6. మాండూక్యము, 7. భృగువల్లి, 8. ఐతరేయము, 9. ఛాందోగ్యము, 10. బృహదారణ్యకము ఈ పది (10). ముఖ్యమైన ఆంధ్రవాచస్పతము
1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నో పనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు (10) శంకరులు భాష్యం వ్రాసినవి.
ఇంకా అనేకాక పాఠ్యంతరములు, సంఖ్యాంతరములు ఉన్నవి.
అందుబాటులో ఉన్న ఉపనిషత్తుల పేర్లివి (అకారాది వర్ణ క్రమంలో; అవి ఏ వేదంలోనివో కూడా సూచితం):
1. అక్షమాలి కోపనిషత్తు (ఋగ్వే),
2. అక్షి ఉపనిషత్తు(యజు),
3. అథర్వశిఖోపనిషత్తు (అథర్వ),
4. అథర్వశిరోపనిషత్తు (అథర్వ),
5. అద్వయతారకోపనిషత్తు (యజు),
6. అధ్యాత్మోపనిషత్తు (యజు),
7. అన్న పూర్ణోపనిషత్తు (అథ),
8. అమృత బిందూపనిషత్తు (యజు),
9. అమృతనాదో పనిషత్తు (యజు),
10. అరుణోపనిషత్తు (సామ),
11. అవధూతోపనిషత్తు (యజు),
12. అవ్యక్తోపనిషత్తు (సామ),
13. ఆత్మ బోధోపనిషత్తు (ఋగ్వే),
14. ఈశ ఉపనిషత్తు (యజు),
15. ఈశావాస్య ఉపనిషత్తు (యజు),
16. ఏకాక్షరోపనిషత్తు (యజు),
17. ఐతరేయోపనిషత్తు (ఋగ్వే),
18. కఠ రుద్రోపనిషత్తు (యజు),
19. కఠోపనిషత్తు (యజు),
20. కలిసంతరణ ఉపనిషత్తు (యజు),
21. కాలాగ్నిరుద్రో పనిషత్తు (యజు),
22. కుండినోపనిషత్తు (సామ),
23. క్షురికోపనిషత్తు (యజు),
24. కృష్ణో పనిషత్తు (అథర్వ),
25.కేనోపనిషత్తు (సామ),
26. కైవల్యోపనిషత్తు (యజు),
27. కౌషీతకీ బ్రాహ్మణ ఉపనిషత్తు (ఋగ్వే),
28. గణపతి ఉపనిషత్తు (అథ),
29. గర్భోప నిషత్తు (యజు),
30. గారుడోపనిషత్తు (అథ),
31. గోపాల తాపస్యుపనిషత్తు (అథ),
32. ఛాందోగ్యోపనిషత్తు (సామ),
33. జాబా లోపనిషత్తు (యజు),
34. జాబాలి ఉపనిషత్తు (సామ),
35. తారసారోపనిషత్తు (యజు),
36. త్రిపురాతాపస్యుపనిషత్తు (అథ),
37. త్రిపురోపనిషత్తు (ఋగ్వే),
38. త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తు (యజు),
39. తురీయాతీత అవధూత ఉపనిషత్తు (యజు),
40. తేజోబిందూపనిషత్తు (యజు),
41. తైత్తిరీయోపనిషత్తు (యజు),
42. దక్షిణామూర్తి ఉపనిషత్తు (యజు),
43. దత్తాత్రేయోపనిషత్తు (అథ),
44. దర్శనో పనిషత్తు (సామ),
45. దేవీ ఉపనిషత్తు (అథ),
46. ధ్యానబిందు ఉపనిషత్తు (యజు),
47.నాదబిందు ఉపనిషత్తు (ఋగ్వే),
48.నారద పరివ్రాజకోపనిషత్తు (అథ),
49.నారాయణోపనిషత్తు (యజు),
50.నిరాలంబోపనిషత్తు (యజు),
51.నిర్యాణోపనిషత్తు (ఋగ్వే),
52. నృసింహతాపసీయోపనిషత్తు (అథ),
53. పంచబ్రహ్మోపనిషత్తు (యజు),
54. పరబ్రహ్మోపనిషత్తు (అథ),
55. పరమ హంసపరివ్రాజకోపనిషత్తు (అథ),
56. పరమహంసోపనిషత్తు (యజు),
57.ప్రశ్నోపనిషత్తు (అథ),
58. పాశుపత బ్రహ్మోపనిషత్తు (అథ),
59. ప్రాణాగ్నిహోత్రో పనిషత్తు (యజు),
60. పైంగలోపనిషత్తు (యజు),
61. బహ్వనోపనిషత్తు (ఋగ్వే),
62. బృహత్ . జాబాలోపనిషత్తు (అథ),
63. బృహదారణ్యకోపనిషత్తు (యజు),
64.బ్రహ్మోపనిషత్తు (యజు),
65. బ్రహ్మవిద్యోపనిషత్తు (యజు),
66. బ్రహ్మ జాబాలోపనిషత్తు (ఋగ్వే),
67. భావనోపనిషత్తు (అథ),
68. భిక్షుకోపనిషత్తు (యజు),
69. మహానారాయణోపనిషత్తు (అథ),
70. మహావాక్యోపనిషత్తు (అథ),
71. మహోపనిషత్తు (సామ),
72. మండల బ్రాహ్మణోపనిషత్తు (యజు),
73. మంత్రకో పనిషత్తు (యజు),
74. మాండూక్యోపనిషత్తు (అథ),
75. ముక్తికోపనిషత్తు (యజు),
76. ముద్గలోపనిషత్తు (అథ),
77. ముండకోపనిషత్తు (అథ),
78. మైత్రాయుణ్యపనిషత్తు (యజు),
79. మైత్రేయోపనిషత్తు (యజు),
80. యాజ్ఞవల్క్యోపనిషత్తు (యజు),
81. యోగకుండలి ఉపనిషత్తు (యజు),
82. యోగచూడామణి ఉపనిషత్తు (సామ),
83. యోగతత్త్వోపనిషత్తు (యజు),
84. యోగశిఖోపనిషత్తు (యజు),
85. రామతాపసీయోపనిషత్తు (అథ),
86. రామరహస్యోపనిషత్తు (యజు),
87. రుద్రహృదయోపనిషత్తు (యజు),
88. రుద్రాక్షజాబాలోపనిషత్తు (సామ),
89. వజ్రసూచి ఉపనిషత్తు (సామ),
90. వరాహోపనిషత్తు (యజు),
91. వాసుదేవోపనిషత్తు (యజు),
92. శరభో పనిషత్తు (అథ),
93. శాట్యాయనీయో పనిషత్తు (యజు),
94. శాండిల్యోపనిషత్తు (అథ),
95. శారీరకోపనిషత్తు (యజు),
96. శుక రహస్యోపనిషత్తు (యజు),
97. శ్వేతాశ్వరో పనిషత్తు (యజు),
98. సన్న్యాసోపనిషత్తు (యజు),
99. సర్వసారోపనిషత్తు (యజు),
100. స్కందోపనిషత్తు (యజు),
101. సరస్వతీ రహస్యోపనిషత్తు (యజు),
102. సావిత్రి ఉపనిషత్తు (సామ),
103. సీతోపనిషత్తు (అథ),
104. సుబాలో పనిషత్తు(యజు),
105. సూర్యోపనిషత్తు (ఋగ్వే),
106. సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్తు (ఋగ్వే),
107. హయగ్రీవోపనిషత్తు (ఋగ్వే),
108. హంసోపనిషత్తు (యజు).