వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : శ్రీరాముని గుణములు

శ్రీరాముని గుణములు
శ్లోకాలు 1.1.2 నుండి 1.1.20 వరకు

వ్యాసులవారు నారదుని అడిగిన సత్పురుషుని (రాముని) 17 గుణములు:-
వాల్మీకి అడిగినవాని సద్గుణములు 17, అవి. 1. సద్గుణ సంపన్నుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మజ్ఞుడు, 4. కృతజ్ఞుడు, 5. సత్యవాది, 6. ఆడినమాట తప్పనివాడు, 7. నిశ్చలసంకల్పుడు, 8. సదాచార సంపన్నుడు, 9. లోక హితకారి, 10. సర్వ శాస్త్రజ్ఞుడు, 11. సర్వ సమర్థుడు, 12. ప్రియదర్శనుడు, 13. ధైర్యశాలి, 14. జితక్రోధుడు, 15. తేజశ్శాలి, 16. అసూయరహితుడు, 17. యుద్దభూమి ఎదురైన దేవతలకు సహితము భయంకరుడు.

నారదమహర్షి వ్యాసభగవానులవారికి చెప్పిన 75 రామగుణములు.:-
1) ఇక్ష్వాకు వంశోద్భవుడు, 2) పేరే రాముడు అనగా రమింపజేయువాడు, 3) జగత్ప్రసిద్దుడు, 4) మనోనిగ్రహశాలి, 5) అమిత పరాక్రమవంతుడు, 6) గొప్ప తేజశ్శాలి, 7) ధైర్యశాలి, 8) జితేంద్రియుడు, 9) బుద్ధిమంతుడు, 10) నీతిమంతుడు, 11) సకల విద్యాపారంగతుడు, 12) శ్రీమంతుడు. 13) శత్రుసంహారుడు. 14) ఎత్తైన మూపురముల వాడు. 15) గొప్ప బాహువుల వాడు. 16) శంఖము వంటి కంఠము వాడు, 17) ఎత్తైన చెక్కిళ్ళ వాడు, 18) విశాల వక్షస్థలుడు, 19) గొప్ప విలుకాడు, 20) గూఢమైన భుజుడు, 21) శత్రునిగ్రహనుడు, 22) ఆజానుబాహుడు, 23) చక్కని శుభలక్షణయుత తల, నుదురు కలవాడు, 24) మహాశూరుడు, 25) పొడవుకు తగిన లావు సమానమైన దేహము కలవాడు, 26) అవయవములన్నీ చక్కగా అమరి ఉంటాయి, 27) ప్రకాశవంతమైన దేహఛాయ కలవాడు, 28) గొప్ప పరాక్రమశాలి, 29) బలమైన వక్షస్థలము కలవాడు, 30) విశాల నేత్రములు కలవాడు, 31) ఐశ్వర్యవంతుడు, 32) మంగళప్రదుడు, 33) ధర్మజ్ఞుడు, 34) సత్యసంధుడు, 35) ఆడినమాట తప్పనివాడు, 36) సర్వదా ప్రజాహితకారి, 37) గొప్ప కీర్తిమంతుడు, 38) జ్ఞాన సంపన్నుడు, 39) పవిత్రుడు, 40) జితేంద్రియుడు, 41) వినయశాలి, 42) మనో నిబ్బరము కలవాడు, 43) ప్రజాపతులతో సముడు, 44) శ్రీమంతుడు, 45) ప్రజల బాధ్యతవహించువాడు, 46) శత్రుసంహారకుడు, 47) ప్రాణికోటిని కాపాడువాడు, 48) ధర్మరక్షకుడు, 49) స్వధర్మరక్షకుడు, 50) స్వజనపాలకుడు, 51) వేద వేదాంగ పారంగతుడు 52) తత్వజ్ఞుడు, 53) ధనుర్వేదంలో నిష్ణాతుడు, 54) సకలశాస్త్రముల తత్వార్థములు తెలిసినవాడు, 55) అసాధారణ జ్ఞాపకశక్తి కలవాడు, 56) సమయస్పూర్తికల ప్రతిభాశాలి, 57) సకలలోకప్రియుడు, 58) సాధుస్వభావి, 59) మహాధీరుడు, 60) సదసద్వివేకి, 61) సత్పురుషులకు నిరంతర ప్రాప్యస్థానము, 62) పూజ్యుడు, 63) అందరి ఎడ సమభావంతో ఉంటాడు, 64) ఎప్పుడైనాసరే ముఖ్య ప్రీతిపాత్రుడు, 65) సర్వసుగుణోపేతుడు, 66) కౌసల్య ప్రియపుత్రుడు, 67) గంభీరంలో సముద్రుడు, 68) ధైర్యములో హిమవంతుడు, 69) పరాక్రమములో విష్ణువు, 70) ఆహ్లాదమిచ్చుటలో చంద్రుడు, 71) క్రోధంలో అగ్ని, 72) సహనంలో భూదేవి, 73) త్యాగములో కుబేరుడు, 74) సత్యపాలనలో అపర ధర్ముడు, 75) తిరుగులేని పరాక్రమము కలవాడు.