వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : మరుత్తులు

మరుత్తులు
1.37.24.అనుష్టుప్.

కశ్యపుని భార్య దితికి పుట్టినవారు దైత్యులు, అదితి పుట్టినవారు ఆదిత్యులు. వీరిలో ఇంద్రుడు దేవతల ప్రభువు. దైత్యులు ఇతని వలన ఇబ్బందుల పాలవుతున్నారు అని, అసురసంధ్యవేళ దితి ఇంద్రుని సంహరించు పుత్రుని కోరి భర్త కశ్యపుని కోరుతుంది. కశ్యపుడు అందుకు ఏడాది పాటు చేయవలసిన పుంసవన వ్రతము చేయమని చెప్తాడు. వ్రతభంగం కారాదు అని చెప్తాడు. కాని, ఒక మారు జరిగిన వ్రతభంగం కనిపెట్టి. ఇంద్రుడు దితి గర్భం జొచ్చి, పిండాన్ని నరుకగా, అది ఏడు ఏళ్ళు అనగా నలభైతొమ్మిది ముక్కలై సజీవంగా ఉండి జన్మిస్తారు. వారు మరుత్తులు ఇంద్రునితో మిత్రత్వం పొంది అను పేర దేవగణమయిరి. వీరందరు అగ్ని స్వరూపులు.