జాబితాలు : కృత్తికలు
కృత్తికలు
37వ సర్గ.
అగ్ని దేవుడు ఋషి భార్యలను మోహించాడనీ, అప్పుడు తన భర్త ఋషుల శాపానికి గురి అవుతాడని భయపడిన అగ్ని భార్య స్వాహాదేవి తానే ఆ ఋషుల భార్యల రూపం ధరించి అగ్నిని సంతృప్తి పరచించనీ, ఒక్క వసిష్ఠుడి భార్య రూపాన్ని మాత్రం ధరించలేకపోయిందనీ ఐతిహ్యం. అరుంధతి పాతివ్రత్యం తమ భార్యలకు లేకపోయిందని భావించిన ఆరుగురు ఋషులు తమ భార్యలను దూరంగా ఉంచారు. అందువల్ల సప్తర్షి మండలంలో అరుంధతి మాత్రమే కనిపిస్తుంది. దూరంగా ఉన్న ఆరుగురే ఈ కృత్తికలు. అగ్ని సంపర్కం వల్ల ఱెల్లులో జన్మించిన కుమార స్వామికి ఈ ఆరుగురు ఋషిపత్నులు స్తన్యమిచ్చి పోషించారనీ, కుమార స్వామి ఆరు ముఖాలతో ఈ ఆరుగురి పాలను తాగి షణ్ముఖుడైనాడని అంటారు. కృత్తికలు పెంచిన వాడు కనుక కుమారస్వామి కార్తికేయుడైనాడు. సప్తర్షి మండలంలో వసిష్ఠుని భార్య అరుంధతి మాత్రమే కనిపిస్తుంది. వివాహానంతరం వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం సంప్రదాయం. మిగతా ఆరుగురు ఋషుల భార్యలే ఈ ఆరుగురు కృత్తికలు కృత్తికా నక్షత్రంగా దూరంగా ఉంటారు.
పాఠ్యంతరంలో కృత్తికలు పార్వతీదేవి అంశలు ఐన ఈ ఆరుగురు కృత్తికల పేర్లు శివ , సంభూతి, ప్రీతి, సన్నతి, అనసూయ మరియు క్షమా.
అశ్విని మొదలైన 27 నక్షత్రాలలో మూడవది కృత్తిక. కృత్తిక ఆరు నక్షత్రాల సమూహం. ఈ 27 నక్షత్రాలన్నీ దక్ష ప్రజాపతి పుత్రికలు, చంద్రుని భార్యలు. కృత్తికా నక్షత్రం అని ఏకవచన మైనప్పటికీ అందులో ఆరు ఉన్నాయి గనుక అది నిత్య బహువచనమని వాడుక.
కుమారస్వామి, ఈ ఆరుగురు వద్ద ఆరు ముఖములతో ఒకేమారు శిశువుగా స్తన్యం తాగినవాడు కనుక షణ్ముఖుడైనాడు.
స్కంధుడు - గంగాదేవి గర్భంలో ఉన్న ఆ తేజస్సును భరించలేక జార్చచేసి. హిమవత్పర్వత పాదము వద్ద ఉంచుతుంది. అలా గర్భమునుండి జారిన (స్కంధ) వాడు కనుక స్కంధుడైనాడు