వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : హాసములు

హాసములు,

షడ్విధ హాసములు ఆఱు (6) విధములు
[భరతనాట్యశాస్త్రము 6-52]

1. సిత్మము (కొద్ది నేత్రవికాసము, అధర చలనము గలది),
2. హసితము (దంతములు ప్రకటింపబడునది),
3. విహసితము (మధురస్వర సంయుక్తము),
4. ఉపహసితము / ప్రహసితము (అంస, శిరః కంపసమేతము),
5. అపహసితము (బాష్పయుక్తము),
6. అతిహసితము (శరీరకంపయుక్తము).

పాఠ్యంతరము
1. సిత్మము (చిఱునవ్వు, పైకి వినబడదు, కన్నులు, పెదవులను బట్టి తెలియును),
2. హసితము (నవ్వు, మెల్లిగా వినబడునది),
3. విహసితము (కేరింత, కొద్దిసేపు గట్టిగా వినబడునది),
4. ఉపహసితము / ప్రహసితము (చెంగలించు, తలూపుతూకూడి అధికంగా వినబడునది),
5. అపహసితము (వెక్కిరింతతో కూడిన నవ్వు, పరిహాసము),
6. అతిహసితము (పగలబడి నవ్వు, ఒళ్ళంతా ఊగిపోతూండగా బాగా గట్టిగా వినబడునది).