జాబితాలు : బ్రాహ్మణులు నిర్వచనం
బ్రాహ్మణులు నిర్వచనం
అనుష్టుప్
శిక్షావ్యాకరణం ఛన్జో
నిరుక్తం జ్యోతిషం తథా ।
కల్పశ్చేతి షడంగాని
వేదస్యాహుర్మనీషిణః ॥
అనుష్టుప్
శౌచాచారస్థితస్సమ్య
గ్విఘసాశీ గురుప్రియః ।
నిత్యవ్రతీ సత్యసర
స్సవై బ్రాహ్మణ ఉచ్యతే ॥.
దశవిధ-బ్రాహ్మణులు
దశవిధ-బ్రాహ్మణులు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002.
(ఆ.) 1. దేవుడు, 2. ముని, 3. ద్విజుడు, 4. రాజు, 5. వైశ్యుడు, 6. శూద్రుడు, 7. నిషాదకుడు, 8. పశువు, 9. మ్లేచ్ఛుడు, 10. చండాలుడు [బ్రాహ్మణుల గుణ ధర్మాదులను (వర్ణములను) అనుసరించి యీ భేదములు] [అ.సం. 373.]
1. దేవబ్రాహ్మణుడు- అర్చకుడు, పూజారి, దేవపూజ వలన జీవించువాడు, వ్యు. దేవపూజకః బ్రాహ్మణః
2. మునిబ్రాహ్మణులు- అత్యగ్రభాగః, ఆంధ్ర-సంస్కృత కోశము (పుల్లెల, కప్పగంతుల ఆం.ప్ర.సా.అ.) 1971. బ్రాహ్మణ ఋషి. ముని, వ్యు. మన (అవభోధనే) + ఇన్- వృషో- ఉత్వమ్, కృ.ప్ర.
3. ద్విజబ్రాహ్మణుడు- ఉపనయన సంస్కారము పొందిన బ్రాహ్మణుడు.
4. రాజబ్రాహ్మణ[1] : సంస్కృత-ఆంధ్ర నిఘంటువు (వ్యుత్పత్తి, నిర్వచన సహితంగా) (ముదిగంటి గోపాలరెడ్డి) 2019 [రాజన్+బ్రాహ్మణ, రాజయోగ్యః బ్రాహ్మణః] రాజుకు తగ్గ బ్రాహ్మణుడు.
5. వైశ్యబ్రాహ్మణుడు- వైశ్యవృత్తి అయిన వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము మున్నగువానినిపై జీవించెడివాడు
6. శూద్రబ్రాహ్మణుడు- బ్రాహ్మణ్య విధానము లేక కాయకష్టముచేసి క్లేశపడు జీవనము కలవాడు.
7. నిషాదకబ్రాహ్మణుడు-బ్రాహ్మణునకు శూద్రస్త్రీయందు పుట్టినవాడు.
8. పశువు- యజ్ఞాదులందు విశసనము కొఱకైన బ్రాహ్మణుడు.
9. మ్లేచ్ఛుబ్రాహ్మణుడు- మాంసభక్షకుడై సమస్తాచారములు వదలి (అనుసరింపక) మెలగు మ్లేచ్ఛబ్రాహ్మణుడు.
10. చండాలబ్రాహ్మణన్యాయము : సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి) 1939
స్వధర్మభ్రష్టుడయిన బ్రాహ్మణుడు చండాలునితో సమానుఁడగును.
చండాలబ్రాహ్మణుడు- పరులను హింసింపుచు కౄరుడై పర ధనద్రవ్యాపహారణాభిలాషులై పరదారాగమనాసక్తులై ఉండు బ్రాహ్మణుడు చండాలబ్రాహ్మణుడు, ఆంధ్రశబ్దరత్నాకరము.