ఛందస్ : అనుష్టుప్ ఛందస్
అనుష్టుప్ ఛందస్
1} వాల్మీకీయ ఆదికావ్యం శ్రీమద్రామయణం అనుష్టుప్ ఛందస్సులో ఉన్నది. (kamakoti.org)
2} అనుష్టుప్ వృత్త ఛందస్సుల కన్నా పురాతనమైనది.
3} అనుష్టుప్ శ్లోకం వృత్త ఛందస్సు కాదు. ఇది వేద ఛందస్సు. కాని కావ్యాదులలో శ్లోకానికి, వేదాలలో వలె స్వరభేదం / శబ్దస్తాయి బేదం నిర్దేశం లేదు.
4} అనుష్టుప్ శ్లోకానికి ప్రతి శ్లోకానికి 8 అక్షరాలు కలిగి నాలుగు పాదాలు ఉంటాయి.
కాలంతరములో క్రింది నియమములు చేరి ఉండవచ్చు.
5} శ్లోకములకు యతినియమము ముఖ్యము. వృత్తరత్నాకరము నిర్వచనము “యతిర్విచ్ఛేద సజ్ఞకః”. “శ్లోకేషు విశ్రమస్థానం పదచ్ఛేదం యతిర్విదుః” అని వృత్తరత్నాకర ధీశోధనీ వ్యాఖ్య. ఇక్కడ విచ్చేదమంటే పదవిచ్ఛేదమనే అర్థము. పద్యమందలి ప్రతిపాదములోనూ యతిస్థానము ఉంటుంది. పద మధ్యమున యతి రాకూడదు. (పాదాంతమున పదము విరువబడవలెను అది యతినయమము) ఇది సంస్కృత సంప్రదాయ నియమము. అలా వచ్చిన యతి భంగము అంటారు లాక్షణికులు. తెలుగులో (భాషా లక్షణమైన సంధిప్రయోగ విధమువలన) దీనికి ప్రత్యామ్నాయముగా పాద్యక్షర మైత్రి విధిగా పాటించేలా (యతిమైత్రి) తెలుగు లాక్షణికులు ఏర్పాటుచేసిరి. ఇది తోపెల్ల సుబ్రహ్మణ్యం వారి వివరణ.
6} ఇట్టే యతినియమానుసారము నిర్ణయింప బడు పాద సంఖ్య ప్రకారము ఛందస్సులకు పేర్లు వచ్చినవి. వాటిలో గణభేదమును బట్టి ఏర్పడగల ఛందస్సులను లాక్షణికులు ప్రస్తారమని గుర్తించిరి.
7} అనుష్టుప్ ఛంధము - ప్రస్తారమున దీనికి 256 భేదములు ఉన్నాయి. దీనిని విద్యున్మాల మాణవకాక్రీడ, చిత్ర పద, హంసరుత, ప్రమాణిక, సమానిక, శ్లోక. . . భేద ప్రబేధములు ఉన్నాయి.
8} అనుష్టుప్ శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 5వ అక్షరము లఘువు, 6వ అక్షరము గురువు; 7 అక్షరము ప్రధమ, తృతీయ చరణములందును దీర్షముగాను; ద్వితీయ,చతుర్ధ చరణములందు హ్రస్వముగాను ఉండును.
~x~