అయోధ్య కాండ : దశరథుని శాపము
దశరథుని శాపము
సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి, సింహానంపై కూర్చున్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పాడు. దశరథుడు కొపోద్రేకంతో స్పృహతప్పి కింద పడిపోయాడు. కౌసల్య సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, “మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైక ఏమున్నా అనుకుంటుంది అనా? ఆవిడగారిక్కడ లేదుగా!” అని చెప్పింది. దశరథుడితో బాటు కౌసల్య, ఇతర అంతఃపుర కాంతలూ రోదనలు చేశారు. నా ఆజ్ఞకు ఎంత విలవ ఉందో నాకు తెలియదు. నీవు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా! లేదా నన్ను ఆ రాముడి దగ్గరికైనా తీసుకుపో,” అన్నాడు దశరథుడు. కౌసల్య కూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకెళ్లి పొమ్మన్నది. సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ, రామలక్ష్మణులు సులువుగా అరణ్యవాసం పూర్తి చేయగలరనీ, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదనీ, రాముడు లేని అయోధ్య ఆమెకు ఆరణ్య మనిపించి ఉండేదని అన్నాడు.
మర్నాడంత కౌసల్య దశరథుణ్ణి దెప్పుడు మాటలతో బాధించింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది. అసలే బాధపడుతున్న తనను దెప్పడు మాటలతో హింసించవద్దని దశరథుడు చేతులు జోడించి కౌసల్యను వేడుకున్నాడు. కౌసల్య పుత్రశోకానికితోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది.
రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక ముని పల్ల శాపం పొందాడు. అప్పుడాయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు.
ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు చప్పుడును బట్టి గురి చేసి కొట్టుట అను శబ్ధవేధి విద్యలో చాలా నేర్పుండేది. ఈ శబ్దవేదిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యువరాజై ఉన్న దశరథుడు తరచూ రాత్రివేళ సరయూ నది తీరానికి వెళ్ళేవాడు, అక్కడ వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని, వీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులనూ, సింహాలనూ, ఇతర మృగాలనూ వేటాడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి వానాకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీతీరాన పొంచి కూర్చున్నాడు ఆ సమయంలో నదినీటిలో బుడబుడమని చప్పుడయ్యాడు. అడవి ఏనుగు అయివు ఉంటుందనుకొని దశరథుడు చప్పుడుకు గురిచేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది “అయ్యయ్యో తపస్సు చేసుకునే వాళ్ళ మీద ఈ బాణం పడటమేమిటి నేను ఎవరికి అపకారం చేశాను నన్ను చంపిన వాడికి ఏం లభిస్తుంది.”
“ఎవడోగాని, ఒక్క బాణంతో మూడు ప్రాణాలు తీశాడే! నేను పోతే, ముసలి వాళ్ళూ, గుడ్డి వాళ్ళూ అయిన నా తల్లిదండ్రు లెంతకాలం బతుకుతారు? ఎలా బతుకుతారు?” అన్న మాటలు దశరథుడి చెవుల పడ్డాయి. ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక ముని కొడుకు కొలను ఒడ్డున బాధతో గిలగిల లాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది. మతిపోయి చెయ్యి కాలూ ఆడక నిలబడి ఉన్న దశరథుడితో ఆ ముని కుమారుడు “ఎందుకు చేశావి పాడుపని నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్లి చెప్పు లేకపోతే అతనికి తెలిసే మార్గం లేదని తెలిసి ఆయన రాలేడు దాహంగా ఉన్నదంటే నీరు తీసుకుని పోదామని వచ్చి నీ బాణం వాత పడ్డాను ఈ బాధ భరించలేను ముందు ఈ బాణం లాగి మరి వెళ్ళు” అన్నాడు
కుఱ్ఱవాడు బాధపడి పోతున్నాడు బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరథుడు మొదట తటపటాయించిన చివరకు ఆ కుఱ్ఱవాడి ప్రోద్భలం మీదనే బాణం లాగేశాడు వెంటనే ముని కొడుకు ప్రాణాలు వదిలాడు తర్వాత దశరథుడు ఆ కుఱ్ఱవాడి పాత్రలో నీరు ముంచుకుని చెప్పిన దారిలోనే అతని తల్లిదండ్రులు కుటీరానికి వెళ్ళాడు.
దశరథుడి అడుగులు చప్పుడు విని తన కొడుకే ననుకొని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు “నాయన! ఎప్పుడో అనగా మంచినీటి కోసం వెళ్లిన వాడివి ఇంత ఆలస్యం చేసావేలోపలికి రా త్వరగా ఇయ్యి అన్నాడు.” “నేను మీ అబ్బాయిని కాను దశరథుడిని క్షత్రియుణ్ణి” అంటూ తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్త ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతులేదు దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్లి దాని మీద పడి పెద్ద పెట్టుకున్న ఏడ్చారు ముసలి ముని దశరథుడితో “మాకున్న ఒక్క కొడుకును అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు కనుక నీవు కూడా పుత్ర శోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను” అన్నాడు. తరువాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు తన ఆయువు తీరిపోయే దశలో జ్ఞాపకం వచ్చింది ఆయన కౌసల్యకు చెప్పాడు.
కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరథుడికి చూపు మందగించింది క్రమంగా శ్రవణ శక్తి కూడా పోయింది బుద్ధి వికలమై పోసాగింది ఆయన రామున్ని కేకలు పెడుతూ కైకేయుని తిడుతూ అర్ధరాత్రివేళ ప్రాణాలు వదిలాడు. అది రాముడు బయలుదేరి వెళ్లిన ఆరో రోజు అర్ధరాత్రి ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ కౌసల్యా సుమిత్రలు సహితం నిద్రపోతున్నారు రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారిగాని అంతఃపుర కాంతులకు తెలియలేదు అంతపురంలో శోకాలు సాగినాక పైవారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వశిష్టుడు మొదలైన వారు వచ్చారు. దశరథుడికి అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గర లేడు రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళారు భరత శత్రుజ్ఞులు భరతుడి మేనమామ అయిన కెకెయ రాజు ఇంట ఉన్నారు.