వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

[జాలతెలుగులారా! ఈ జాలగూడునందు ప్రస్తుతానికి బాలకాండ వాడుకొనగలరు. ఉన్నతీకరణలు జరుగుతున్నవి. కనుక కలుగు ఇబ్బందులకు దయచేసి, ఓర్చుకొన మనవి]

శ్రీరామ
నమో భగవతేవాసుదేవాయ

పోతన తెలుగు భాగవతానికి లంకె

ఓం సహనావవతు| సహనౌభునక్తు|
సహవీర్యం కరవావహై|
తేజస్వి నావధీతమస్తు| మా విద్విషా వహై|

ఓం శాంతిః శాంతిః శాంతిః||

  తెలుగుజాలజనులారా! మీకు స్వాగతం సుస్వాగతం. . రండి రండి. . . మీ ఈ తెలుగురామాయణఃడాట్ కామ్ కు రండి....హైందవ ధార్మికులకు ముఖ్యంగా మన తెలుగులకు ఆరాధ్య దైవం శ్రీరామచంద్రప్రభువు. ఎంతగా అంటే "శ్రీరామ రక్ష జగదభిరక్ష.." అన్నంతగా.. "ఏనుగమ్మా ఏనుగు. మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేముడు" అన్నంతగా.
అట్టి రాముని చరితమైన శ్రీమద్రామాయణము. మనలో చాలా కుటుంబాలలో పారాయణ చేయడం సంప్రదాయం కదా. దానిని మూల శ్లోకాలు, అర్థతాత్పర్యాలతో తెలుగు జాలజను లందరికీ అందుబాటులోకి తేవాలని. నల్లనయ్య నిర్దేశం ప్రకారం, ఆ బృహద్యత్నం ఈ తెలుగురామాయణః. దీనిని సత్సంగంగా ఏర్పడి రామకార్యంగా చేపట్టాము.

  మీ అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఈ ప్రయత్నం జయప్రదంగా, శుభప్రదంగా జరిగేలా అందించ మనవి.

 17.04.2024న, బాలకాండ ప్రచురించడ మైనది.

కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం।
ఆరుహ్య కవితా శాఖాం
వందే వాల్మీకి కోకిలమ్॥

- ఊలపల్లి
భాగవత గణనాధ్యాయి